సీఎం కేసీఆర్ గవర్నర్ కు క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సీఎం కేసీఆర్ గవర్నర్ కు క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
CM KCR should apologize to the Governor MLC Jeevan Reddy

జగిత్యాల, ముద్ర ప్రతినిధి: రాజ్యాంగాన్ని అవమానపరిచిన సీఎం కేసీఆర్ గవర్నర్ కు  క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలో జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ మనం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిందేనని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే వచ్చిందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం అమలైన గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఉత్సవాలు జరిపించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం హైకోర్టును ఆశ్రయించడం బాధాకరమన్నారు.

గవర్నర్ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. భారత రాజ్యాంగం మూలం భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని వ్యక్తిగత కారణాలతో భారత రాజ్యాంగాన్ని కించపరచడం అగౌరవపరచడానికి దిగజారడం బాధనిపిస్తుంది అన్నారు. కెసిఆర్ యొక్క చర్య యావత్ భారత పౌరుడు చర్చించే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట అగౌరవపడే విధంగా వ్యవహరించడం దారుణమని దీనికి కేసిఆర్ బాధ్యత వహించాలన్నారు. దీనిని సరి చేసుకోవాలంటే క్షంతవ్యుడిగా గవర్నర్ క్షమాపణ చెబితే రాజ్యాంగానికి క్షమాపణ చెప్పినట్లు ఉంటుందని జీవన్ రెడ్డి అన్నారు.