ఆస్ట్రేలియాలో ఘనంగా యాదగిరీశుని కళ్యాణోత్సవం వేడుకలు

ఆస్ట్రేలియాలో ఘనంగా యాదగిరీశుని కళ్యాణోత్సవం వేడుకలు

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 4 (ముద్ర న్యూస్) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం  ఆస్ట్రేలియా దేశంలో ని మెల్బోర్న్ సిటీ లో తెలుగు కల్చరల్ అసోసిషన్ వారి ఆధ్వర్యంలో  శ్రీ రాఘవేంద్ర మఠం మురాంబీన్ నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ  కళ్యాణం నందు మెల్బోర్న్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట దేవస్థాన ఇఓ మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానానం పైన ప్రత్యేక శ్రద్ధతో బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రత్యేక శ్రద్ద వహించి ఆలయమును  పునర్నిర్మించారని, తెలుగువారు ఇండియా కు విచ్చేసిన సందర్భంలో తప్పక యాదాద్రి దేవస్థానానికి విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకుని స్వామి వారికి కృపకు పాత్రులు కావాలని ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వారందరిని కోరడం జరిగింది. కళ్యాణం అనంతరం మెల్బోర్న్ లో కళ్యాణం ఏర్పాటు చేసిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా వారికి దేవస్థాన ఇవో గీత, ఎఇవో గజవెల్లి రఘు  ధన్యవాదాలు తెలియజేసినారు. అనంతరం ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వారు ఇవో, ఎఇవో మరియు కళ్యాణం నిర్వహించిన ఆలయ అర్చకులను సన్మానించారు.