విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి - జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ 

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి - జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విజయదశమి పండుగ  ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆకాంక్షించారు.   విజయదశమిని పురస్కరించుకొని  జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఎస్పీ ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈ  కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీలో ప్రభాకర రావు, భీమ్ రావ్ ,  డిఎస్పీ లు వెంకట స్వామీ, రవీంద్ర కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు జానీ మియా, రామకృష్ణ, వేణు, టౌన్ ఇన్స్పెక్టర్ నటేశ్, ఎస్ బి  ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు, ఆర్ ఎస్ ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.