అలా నిరూపించినట్లైతే తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి వైదొలగుతాడు - బండి సంజయ్ కి సవాల్ విసిరిన మంత్రి పొన్నం

అలా నిరూపించినట్లైతే తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి వైదొలగుతాడు -  బండి సంజయ్ కి సవాల్ విసిరిన  మంత్రి పొన్నం

ముద్ర,తెలంగాణ:- కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు నెలల్లో 6 గ్యారెంటీల్లో  తొలుత చేయాల్సినవి అమలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొన్నం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారని.. మరి కేంద్రంలో పదేళ్ల పాలనలో బీజేపీ ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అలా నిరూపించినట్లైతే.. తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్‌లో లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి వైదొలగుతారని సవాలు విసిరారు.