మిర్యాలగూడ జిల్లా అంశం ఎన్నికల మేనిఫెస్టోలలో చేర్చాలి - ధూళిపాల

మిర్యాలగూడ జిల్లా అంశం ఎన్నికల మేనిఫెస్టోలలో చేర్చాలి - ధూళిపాల

నేరేడుచర్ల  ముద్ర : అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ ను జిల్లాగా ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలలో పొందుపరచాలని  బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. కేవలం 9 మండలాలు ఉన్న సిరిసిల్లను, ములుగు,నారాయణఖేడ్ ను  బారాస ప్రభుత్వం జిల్లాలుగా ఏర్పాటు చేసిందన్నారు. హుజూర్నగర్ , మిర్యాలగూడ నాగార్జునసాగర్ తో కలిపి 17 మండలాలు ఉన్నాయని అందువల్ల జిల్లా గా మార్చాలని ఇప్పటికే 33 మండలాలతో నల్లగొండ జిల్లా తెలంగాణలోని అతి పెద్ద జిల్లాగా  ఏర్పడి ఉన్నదని అందులో నుంచి పది మండలాలు వేరు చేస్తే ఇంకా 23 మండలాలు నల్గొండ జిల్లాకు మిగిలే ఉంటాయని అన్నారు. ఆసియా ఖండంలోని అతి ఎక్కువ రైస్ మి ల్లులు,సిమెంట్ ఫ్యాక్టరీలు,రైలు సౌకర్యం లాంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్నందున జిల్లాగా ఏర్పాటు చేస్తే అటు సాగర్ నియోజకవర్గానికి ఇటు హుజూర్నగర్ నియోజకవర్గానికి మధ్యలో మిర్యాలగూడ జిల్లా అయితే అందరికీ  అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు,హుజూర్నగర్ ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపితే  ఖచ్చితంగా జిల్లా సిద్ధిస్తుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.ఈనెల 27న మిర్యాలగూడలో తలపెట్టిన బంద్ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం  సంపూర్ణ మద్దతిస్తుందని విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరించారు.