తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు పెరుగుతున్న ప్రజాదరణ

తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు పెరుగుతున్న ప్రజాదరణ
  • రాత్రి ప్రచారంలో సైతం వేలాదిగా తరలి వస్తున్న కార్యకర్తలు 
  • మంగళ హారతులు కోలాటాలు మేళతాళాలతో ఘన స్వాగతం పలుకుతున్న కేడర్
  • ముచ్చటగా మూడోసారి విజయ సాధించడానికి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే
  • నియోజకవర్గంలోని పెద్ద గ్రామాల్లో ఎమ్మెల్యేకు పెరిగిన ప్రజాదరణ
  • బిఆర్ఎస్ కార్యకర్తల్లో జోరుగా పెరిగిన ప్రచార జోష్

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గంలో  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్  గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుంది. ఉదయం నుండి రాత్రి ఎన్నికల ప్రచార సమయం ముగిసే వరకు వరకు అలుపెరగకుండా ప్రచార పర్వం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పగటిపూట గ్రామాల్లో ఎంతమంది ప్రచారంలో పాల్గొంటున్నారో రాత్రిపూటైనా సరే మీ వెంట మేమున్నామంటూ వందలాదిగా ప్రజలు గ్రామాల్లో  కిషోర్ కుమార్ కు హారతులు పడుతున్నారు. గ్రామ గ్రామాన మంగళహారతులతో మేళ తాళాలతో పూల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్యేను తమ గ్రామంలోకి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు .గత నాలుగైదు రోజులుగా ఎమ్మెల్యే ప్రచార ఉధృతి జోరుగా పెరిగింది.  బిఆర్ఎస్ లీడర్లలో కసి పట్టుదల పెరిగింది .ఎలాగైనా సరే తమ అభ్యర్థి గాదర్ కిషోర్ కుమార్ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని పట్టుదలతో ప్రతి కార్యకర్త ప్రచారంలో పాల్గొనేలా చేస్తూ ముందుకు సాగుతున్నారు  .కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే ప్రజాభిమానాన్ని చు చురగొంటున్నారు. మూడో విడత ప్రచారం చివరి అంకానికి చేరుకున్న తరుణంలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ ప్రచార శైలిని మార్చారు .సమయం దొరికినప్పుడు ఆయా గ్రామాల్లో కూర్చుని ముఖ్యులతో సమావేశం ఏర్పాటుచేసి అనుసరించాలని వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. పార్టీ నుండి ఎవరు వీడకుండా చర్యలు చేపడుతున్నారు .నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయా మండలాల్లోని పెద్ద గ్రామాల్లో తనకు వస్తున్న ప్రజాదరణను అంచనా వేసుకుంటున్నారు.

ఒకటి రెండు రోజులుగా ప్రతికూలమన్న గ్రామాల్లోనే ఎమ్మెల్యే ప్రచార సమయంలో వేలాదిగా జనం తరలి రావడం ఎమ్మెల్యేకు ఎంతో సంతృప్తినిచ్చింది .ముఖ్యంగా తుంగతుర్తి మండలంలోని అన్నారం, సంగం తో పాటు తండాల్లో నిర్వహించిన ప్రచారంలో వేలాదిగా తరలివచ్చిన గులాబీ కార్యకర్తల చూస్తే గాదరి కిషోర్ కుమార్ గెలుపు ఖాయనేనని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు .మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామం డిసిసి అధ్యక్షుని సొంత గ్రామం లో ఎమ్మెల్యే ప్రచార సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని గ్రామంలో గులాబీ పార్టీదే పై చేయి అవి నిరూపించారు. ఇదే విధంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేకు ప్రజాధరణ రోజురోజుకు పెరుగుతుంది .దీంతో గులాబీ శ్రేణుల్లో గెలుపు పై ధీమా పెరిగింది .ఏది ఏమైనా తుంగతుర్తి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గెలుపు ఖాయమేనని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు .ఎమ్మెల్యే కి వస్తున్న ప్రజాదరణ చూస్తే మాత్రం ఖచ్చితంగా గెలుపు వైపు  బిఆర్ఎస్ పార్టీ ప్రయాణిస్తుందని చెప్పవచ్చు .రానున్న వారంరోజులే ప్రచారానికి గడువుండగా  ఈ వారం రోజుల్లో ఎమ్మెల్యే ఏ విధమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తారు మెజార్టీ ఎంత మేరకు సాధిస్తారు వేచి చూడాల్సిందే.