సాయి చంద్ కు ఎమ్మెల్యే పద్మ నివాళులు

సాయి చంద్ కు ఎమ్మెల్యే పద్మ నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్:  ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్  గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే మెదక్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మాదేవేందర్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

సాయిచంద్ భార్యను, కుటుంబ సభ్యులను ఓదార్చుతు తను కంటతడి పెట్టుకున్నారు. అనతికాలంలోనే గాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మంచి గుర్తింపు పొందిన సాయిచంద్ మనల్ని వీడి పోవడం చాలా బాధగా ఉందన్నారు. మన మధ్య లేకపోయినా పాట ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు మనోధైర్యాన్నివ్వాలని ప్రార్తించారు.