రజాక్ పల్లిలో సీసీ రోడ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

రజాక్ పల్లిలో సీసీ రోడ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: నిజాంపేట్ మండలం రజాక్ పల్లి గ్రామ పంచాయతీ ఖాసీం పూర్ గ్రామంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీపీ) నుంచి మంజూరు చేసిన రూ.10.00 వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.    అనంతరం గ్రామస్థులు లేవనెత్తిన సమస్యలకు ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. మన ఊరు-మన బడిలో చేసిన పనులకు సరిగా రికార్డ్ చేయడం చేయడం లేదని ఓ సర్పంచ్ ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న ఏఈతో మాట్లాడి పనులు చేసిన సర్పంచ్ లు, గుత్తేదారులకు నష్టం జరగకుండా చూడాలని ఎమ్మెల్సీ సూచించారు. గ్రామం మీదుగా వెళ్తున్న కాళేశ్వరం కెనాల్ బ్రిడ్జి సమస్య, చెరువు అలుగు సమస్యల గురించి ఎమ్మెల్సీ దృష్టికి గ్రామస్తులు తీసుకు రాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. రజాక్ పల్లి గ్రామానికి అవసరమైన మరో రూ.10 లక్షల నిధులను మంజూరు చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మ సునీత నాగరాజు, ఉప సర్పచ్ సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ లు నరసింహా రెడ్డి, రాజసింగ్, మహిపాల్ రెడ్డి, శ్రీనునాయక్, ఎంపీటీసీ రాజారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ రవీందర్ రెడ్డి, బీఆరెఎస్ నాయకుడు పుట్టి అక్షయ్, మాజీ వైస్ ఎంపీపీ గోపాల రావు, వార్డు మెబర్లు కనకరాజు స్వామి, రాజు, కొండల్, కనకరాజు, నాగయ్య  కుమార్, గుట్టయ్య,  కొమురయ్య, యాదయ్య, గ్రామ ప్రజలు కార్యకర్తలు ఉన్నారు.