మహిళను తీవ్రంగా గాయపరిచిన కోతి

మహిళను తీవ్రంగా గాయపరిచిన కోతి
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో కోతులు పెట్రేగిపోతున్నాయి. పట్టణంలోని బుస్సగడ్డ, అరబ్ గల్లీలో  కోతులు ఒక్కసారిగా దాడి చేయడంతో మహిళ వరలక్ష్మి వీపు, తొడపై తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్ర గాయలైన వరలక్ష్మిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలి కాలంలో కోతుల బెడద పెరిగిపోయింది. ఇంతకు ముందు కూడ కోతులు దాడిచేసి గాయపరిచాయి. వీదుల్లో కుక్కలు, కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. మహిళలు చేతిలో ఏదైనా వస్తువుల సంచి పట్టుకొని వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కోతులు, కుక్కలపై బల్దియా అధికారులు దృస్టిసారించాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని కోతులను పట్టుకెళ్లినా ఇంకా అందుకు రెట్టింపు కోతులు పుట్టుకొచ్చాయి.