స్కూల్ బస్ ని డికొన్న టిప్పర్

స్కూల్ బస్ ని డికొన్న టిప్పర్
  • తప్పిన పెను ప్రమాదం
  • పలువురు విద్యార్థులకు గాయాలు

ముద్ర తూప్రాన్ : విద్యార్థులతో జాతీయ రహదారిపై వెళ్తున్న స్కూల్ బస్ ను టిప్పర్ డికోన్న ఘటన లో స్వల్ప గాయలతో విద్యార్థులు బయటపడడంతో  ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మేడ్చల్ కు చెందిన విజ్ఞాన్ స్కూల్ బస్ లో మనోహరాబాద్ మండల పరిసరాలలోని విద్యార్థులను తీసుకుని జాతీయ రహదారి పై వెళ్తుండగా కళ్ళకల్ గ్రామ పరిధిలో స్కూల్ బస్ ను ఓవర్ టెక్ చేస్తూ టిప్పర్ డ్రైవర్ బస్ ను డికొట్టాడు. ఈ ఘటన లో పలువురు విద్యార్థులకు, టీచర్ కు గాయాలవగా వారిని స్థానికులు మేడ్చల్ లొని హాస్పిటల్ కు తరలించారు.మిగతా విద్యార్థులను వేరే వాహనాలలో తరలించారు.స్వల్ప గాయాలతో బయటపడడం తో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.