నా ఇల్లు రాహుల్ గాంధీకి అంకితం

నా ఇల్లు రాహుల్ గాంధీకి అంకితం

పరువునష్టం కేసులో సూరత్ కోర్టు జైలు శిక్ష విధింపుతో ఎంపీ రాహుల్ గాంధీ అనర్హత వేటుతోపాటు ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు జారీ చేయడంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22వతేదీలోగా ఢిల్లీలోని లుటియన్స్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని లోక్‌సభ హౌసింగ్ కమిటీ తొలగింపు నోటీసు జారీ చేసింది.  దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ కు మద్ధతుగా నిలిచారు. వరణాసి నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ స్థానికంగా ఉన్న తన పూర్వీకుల ఇంటిని రాహుల్ గాంధీకి అంకితం చేసి స్వాగతం పలికారు.  అజయ్ రాయ్ దంపతులు వారి ఇంటి బయట గోడకు ''మేరా ఘర్ శ్రీ రాహుల్ గాంధీజీకా ఘర్'' అంటూ ఆయన ఫొటోతో నేమ్ ప్లేటు పెట్టారు.