సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మేళా ను ఆదరించండి

సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మేళా ను ఆదరించండి
  • సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘం విజ్ఞప్తి
  • రెండు రోజుల పాటు మేళా

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు, మామిడి మేళాను వినియోగదారులు సందర్శించి రైతులను ఆదరించాలని సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘం ప్రతినిధులు కోరారు. శనివారం ఆహ్వాన సంఘం ప్రతినిధులు గోనె శ్యామ్ సుందర్ రావు, శంకర్ మీడియా తో మాట్లాడారు. ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరుగనున్న మేళాలో  జిల్లాలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శన చేయనున్నారని తెలిపారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు , సబ్బులు, గానుగ వంట నూనె ప్రదర్శనలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని చెప్పారు. ప్రారంభోత్సవం కార్యక్రమంకు రామగుండం సీపీ.రేమా రాజేశ్వరి, కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, డీసీపీ సుధీర్, ఇతర ప్రముఖులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో మేళాలో పాల్గొని సేంద్రీయ ఉత్పత్తులకు కొనుగోలు చేసి సేంద్రీయ వ్యవసాయం ను ప్రోత్సహించాలని కోరారు.

ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులు కేవీ.ప్రతాప్, వినయ్ ప్రకాష్ రావు, తోగరు సుధాకర్, చంద్రశేఖర్ శెట్టి, శ్రీనివాస్ రావు, అత్తి సరోజ, సత్తయ్య, పానుగంటి మధు పాల్గొన్నారు.