డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కు తాగునీరు కోరకు కాళీ బిందెలతో ప్రజల ఆందోళన

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కు తాగునీరు కోరకు కాళీ బిందెలతో ప్రజల ఆందోళన

రంగా రెడ్డి జిల్లా: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ సమావేశం జరుగుతున్న సమయం లో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 29వ డివిజన్ లో డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చి 16 నెలలు గడుస్తున్న మంచినీటి సౌకర్యం కల్పించకపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖాలి బిందెలతో రాలిగా బయలుదేరి మున్సిపల్ కమిషనర్ కి,విద్యా శాఖ మంత్రి కి వినతి పత్రానికి ఇవ్వడానికి వచ్చిన కార్పొరేటర్ ను అడ్డుకున్న పోలీసులు.

కార్పొరేటర్ లీల రవి నాయక్ ను అరెస్టు చేసి తీసుకు వెళుతుండగా కారుకు అడ్డం పడిన ప్రజలు. గతంలో మున్సిపల్ కమిషనర్ కి,మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేసింది. అరెస్టు చేసే సమయంలో పోలీసులకు,కార్పొరేటర్ మధ్య వాగ్వాదం చెడరేగింది. పోలీసులు తన పై అకారణంగా దాడి చేశారని కార్పొరేటర్ అన్నారు.