పోలీసు వాహనం బోల్తా...

పోలీసు వాహనం బోల్తా...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సభ బందోబస్ కోసం వెళ్లిన పోలీస్ వాహనం బోల్తా పడింది ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తకోట లోని మదనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న మహిళ హోంగార్డ్స్ మంజుల ( 40), మహబూబ్నగర్ స్టేషన్లో పనిచేస్తున్న అన్నపూర్ణ (42), ఆర్ ఐ శివాజీ డ్రైవర్, జయంతి (38), తిరుపతి కొల్లాపూర్ లో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లి తిరిగి నాగర్కర్నూల్ వైపు వస్తున్న క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి నాగర్ కర్నూల్ మండలం దేశి ఇటుకల గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా హోంగార్డులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు..