ఓకే రోజులో మారిన పార్టీ కండువా 

ఓకే రోజులో మారిన పార్టీ కండువా 
  • మొన్న బిఆర్ ఎస్..  నిన్న కాంగ్రెస్ .. నేడు బిఆర్ ఎస్ 
  • కప్పదాట్లఫై నేతాల కన్ను 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఎన్నికల శంఖారావం పురించాకముందే అప్పుడే జగిత్యాల జిల్లాలో  కప్పదాట్లు మొదలు అయ్యాయి.శాసన సభ ఎన్నికలు సమిపిస్తుండడంతో బిజేపి, బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పార్టీలో చిన్న చిన్న నాయకులను, కార్యకర్తలను చివరకి ఓటర్లను కూడా తమ పార్టీలలోకి ఆహ్వానించి పార్టి కండువా కప్పి తమ వారు అనిపించుకుట్టున్నారు. జిల్లాలోని ధర్మపురి నియోజక వర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్ కుమార్, జగిత్యాల నియోజక వర్గంలో ఎమ్మెల్సి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ  శ్రావణిలు చేరికలఫై ద్రుష్టి పెట్టి ప్రత్యర్థి పార్టీల నుంచి చిన్న చిన్న నాయాకులను, కార్యకర్తలను చేర్చుకుంటున్నారు. అయితే కొందరు జంపు జిలానీలు సాయత్రం ఒక పార్టీలో ఉంటె ఉదయం మరో పార్టీలో ఉంటున్నారు... పార్టీలోకి చేరికలే కాదు పార్టి క్యాడర్ ను కూడా కాపాడుకోవడం ఆయా పార్టీలకు పెద్ద సమస్యగానే మారింది.

సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన లైషెట్టి వేణు బిఆర్ ఎస్ పార్టీ యూత్ విభాగంలో చాల క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వేణు ఫై ద్రుష్టి సారించిన కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించగా  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది గమనించిన బిఆర్ ఎస్ నాయకులు దిద్దుబాటు చర్యలకు దిగి మరుసటి రోజే మల్లి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వేణుకు బిఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి పునర్ స్వాగతం పలికారు. ఓకే వ్యక్తి 24 గంటల లోపే రెండు కండువాలు, పార్టిలు  మార్చడంతో  ఎన్నికల వేడి ప్రారంబంమై కప్పదాట్లు మొదలయ్యాయని ప్రజలు చర్చించు కుంటున్నారు.