రంగులు మార్చే చీరను తయారుచేసిన సిరిసిల్ల నేత కళాకారుడు

రంగులు మార్చే చీరను తయారుచేసిన సిరిసిల్ల నేత కళాకారుడు

సిరిసిల్ల టౌన్, ముద్ర: సిరిసిల్ల నేత కళాకారుడు, అగ్గిపెట్టెల్లో ఇమిడే చీరను తయారు చేసిన దివంగత నల్ల పరందాములు తనయుడు నల్ల విజయ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తయారు చేసిన ఊసరవెల్లి (రంగులు మార్చే) చీరను మంత్రి కేటీఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆవిష్కరించారు. గతంలో విజయ్ అగ్గిపెట్టె లో పట్టే చీర, సూది లో ఇమిడే చీర, సుగంధాలు వెదజల్లే చీరను తయారు చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నేతన్న విజయ్ ని కేటీఆర్ అభినందించారు.