కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్ కు రక్షక -2023 అవార్డు

కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్ కు రక్షక -2023 అవార్డు

రక్తదాన సహాయర్థానికి ఎంపిక

ముద్ర  ప్రతినిధి కరీంనగర్ : ఫిబ్రవరి 27 అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల దినోత్సవo  పురస్కరించుకొని ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల  ఉత్సవాల సందర్భంగా  విరివిగా రక్తదాన శిబిరాలు , స్వచ్ఛంద రక్తదాన సహాయార్థ కార్యక్రమాలు చేపట్టినందుకుగాను కరీంనగర్ నగరపాలక సంస్థ ఒకటవ డివిజన్ తీగల గుట్టపల్లి బిజెపి కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ కు రక్షక -2023 అవార్డు దక్కింది. రక్తదాన శిబిరం లో తన వంతు కర్తవ్యంగా సమాజంలోని కడు పేదల కోసం , తల సేమియా పిల్లల కోసం అత్యవసర సమయంలో రక్తం కావలసిన వారి కోసం ఆగస్టు మాసం నుండి డిసెంబర్ వరకు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలను నిర్వహించి నందుకు గాను  నిఫా సంస్థ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ స్వచ్ఛంద సేవను  గుర్తించింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లోఫిబ్రవరి 26 న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో "రక్షక అవార్డు 2023" ని  హర్యానా ముఖ్యమంత్రి ‌ మనోహర్ లాల్  చేతుల మీదుగా కార్పొరేటర్ శ్రీనివాస్ అందుకోనున్నారు. అంతర్జాతీయ సంస్థ  నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిట్స్ అండ్ యాక్టివిటీస్ (నిఫా) అంతర్జాతీయ సంస్థ ద్వారా ఈ అవార్డును కార్పొరేటర్ శ్రీనివాస్ కు ఈ సందర్భంగా అందించనుంది. ఇట్టి అవార్డు రావడం పట్ల కొలగాని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. రక్తదాన సేవా కార్యక్రమాలను గుర్తించి  అవార్డుతో తనలాంటి వారిని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు . కార్పొరేటర్ శ్రీనివాస్ సేవలను గుర్తించి  రక్షక అవార్డు అందించడం పట్ల  డివిజన్ ప్రజలు , శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.