ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ఓటు హక్కు, ప్రత్యేక గుర్తింపు కార్డులు- జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మిరాజం

ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ఓటు హక్కు, ప్రత్యేక గుర్తింపు కార్డులు- జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మిరాజం

సిరిసిల్ల టౌన్, ముద్ర: సమాజంలో ట్రాన్స్ జెండర్లకు సమాన హక్కులు, సమాన అవకాశాల చట్టం ప్రకారం వారికి గౌరవప్రదమైన జీవితం అందించడానికి  ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మిరాజం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందని, దీనిలో భాగంగా ఆడ, మగ (మెల్, ఫిమేల్) అనే లింగ బేధం తో పాటు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు కూడా ఒక ప్రత్యేక వర్గంగా గుర్తిస్తూ ఎలక్ట్రోరల్ కాలేజీలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అన్నారు. కావున జిల్లాలో ఉన్న ట్రాన్స్ జెండర్ వ్యక్తులు, లింగమార్పిడి చేయించుకున్న వారు, ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులుగా గుర్తింపు కావాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వబడును అన్నారు. కావున జిల్లా ప్రజలు మరియు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వారి వివరాలని సఖీ  కేంద్రం లో లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ కి లేదా కలెక్టరేట్లో ప్రత్యేకంగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో వీరి కోసం ఏర్పాటు చేసిన సెల్ నందు వారి వివరాలను నమోదు చేయవచ్చును అని తెలిపారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మిరాజం కోరారు.