శతాబ్దాలకు గుర్తిండేలా దశాబ్ది వేడుకలు

శతాబ్దాలకు గుర్తిండేలా దశాబ్ది వేడుకలు
  • శోభాయమానంగా రైతువేదికలు
  • పంట, పథకం, లాభాలపై చర్చ జరగాలి
  • జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :  జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ దశబ్ది ఉత్సవాలను శతాబ్దాలకు గుర్తిండి పోయోల ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ సూచించారు.  జూన్ 3 న నిర్వహించనున్న తెలంగాణ రైతు దినోత్సవ  కార్యక్రమానికి విజయవంతం చేసేలా జిల్లాలోని కరీంనగర్, హుజురాబాద్, మానకోండూర్, చోప్పదండి నియోజక వర్గాలలోని 76 క్లస్టర్ లలో జూన్ 3 న నిర్వహించనున్న రైతువేదికలను పండుగను తలపించేలా మామిడి తోరణాలు, పూలు, సీరియల్ బల్బులతో అందంగా ముస్తాబు చేయడం జరిగింది. 
రైతువేదికలలో జూన్ 3 నాడు తెలంగాణ రాష్ట్ర  ఆవిర్బావం నుండి ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని చాటే ఉచిత భీమా, రైతుబందు, రైతుభీమా, పంటసాగు మెలకువలు, నూతన పంటసాగు విధానం, ఇతర వ్యవసాయ రంగాలను గురించి వివరించంతో పాటు. భీడు భూములను పచ్చటి పంటపోలాలుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దిశానిర్దేశనం, అధికారుల కృషితో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 365 రోజులు అందుతున్న నీరు, 24 గంటల కరేంటు తదితర విజయాలను మరియు జిల్లాలోని రైతులకు అందించిన లబ్దీని కులంకశంగా వివరించడం జరుగుతుంది.  రైతువేదికల వద్ద  ప్రజాప్రతినిధుల,  రైతుల సాముహిక భోజన కార్యక్రమానికి సన్నాహకాలు అద్బుతంగా జరుగుతున్నాయి.