సత్తుపల్లి -ఓట్లు అడుగుతున్న బీజేపీ అభ్యర్థి నంబూరి..

సత్తుపల్లి -ఓట్లు అడుగుతున్న బీజేపీ అభ్యర్థి నంబూరి..

తాత మన గుర్తు కమలం..

 సత్తుపల్లిలో బీజేపీ విస్తృత ప్రచారం..

 సత్తుపల్లి, ముద్ర: బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వర రావు బుధవారం సత్తుపల్లి నియోజవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. గడప గడపకు బిజెపి కార్యక్రమం సందర్భంగా ఓటర్లను కలుసుకున్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. పంచాయతీల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో జరిగే ప్రతి పని కేంద్రం నిధులతోనే సాగుతున్నాయని గుర్తు చేశారు. కాషాయ జెండా విజయంతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బిజెపి  కృషి చేస్తుందన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాయుడు రాఘవరావు, పాలకొల్లు శ్రీనివాసరావు, ఆచంట నాగ స్వామి తదితరులు పాల్గొన్నారు.