సీనియర్​ నటుడు శరత్​ బాబు కన్నుమూత 

సీనియర్​ నటుడు శరత్​ బాబు కన్నుమూత 

సీనియర్​ నటుడు శరత్​ బాబు కన్నుమూశారు. ఆయన వయసు 71. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో మీరోగా, విలన్​గా, క్యారెక్టర్​ ఆర్టిస్టుగా నటించారు. ఆయన స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆముదాలవలస. శరత్​బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1973లో రామరాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.