సీఎంకు తప్పిన ముప్పు!

సీఎంకు తప్పిన ముప్పు!

బెంగాల్​: పశ్చిమ బెంగాల్​సీఎం మమతా బెనర్జీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్​మంగళవారం వాతావరణం అనుకూలించక అననకూల పరిస్థితుల్లో సేవోక్​ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ అయ్యింది. ఈ విషయాన్ని సీఎం అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం మమత జల్​పాయ్​గుడిలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లనుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం హెలికాప్టర్​లో ప్రయాణిస్తుండగా బేంకూట్​పూర్​అటవీ ప్రాంతం వద్ద ఉండగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్​ అధికార వర్గాలకు సమాచారం అందించి సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్​చేయడంతో అధికార యంత్రాంగం ఉపిరి పీల్చుకుంది. అనంతరం మమతా బెనర్జీ అటు నుంచి రోడ్డు మార్గాన బాగాడోగ్రా విమానాశ్రయానికి చేరుకొని కోలకత్తా వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు టీఎంసీ పార్టీ లోని రెండు వర్గాల్లో కుచ్​బిహార్​లో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాల్పులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.