తూప్రాన్ బిఆర్ఎస్ లుకలుకలు?

తూప్రాన్ బిఆర్ఎస్ లుకలుకలు?
  • ఎఫ్డిసి చైర్మన్ కార్యక్రమంలో  కనిపించని మున్సిపల్ చైర్మన్

తూప్రాన్, ముద్ర:ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ లో విబేధాలు మరోసారి బయట పడ్డాయి. గురువారం తూప్రాన్ మున్సిపల్ పరిధిలో ఇతర పార్టీల నుండి పలువురు కార్యకర్తలు, యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. కాగా స్థానిక మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్ లు, నాయకులు మాత్రమే పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్, కొందరు కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వలేదా లేక విబేధాల కారణంగా వారే హాజరు కాలేదా అనే చర్చ మొదలైంది. ఒక వర్గం  ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మరో వర్గం హాజరు కాకపోవడంతో విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.