రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలి

రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలి

బాన్సువాడ, ముద్ర : ఏరియా ఆసుపత్రి, మతాశిశు ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల కు వేతనాలు చెల్లించాలని మంగళవారం నాడు బాన్సువాడ ఏ హెచ్, ఎం సి హెచ్ హాస్పిటల్ సూపరిండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ను ఏఐటియుసి నాయకులు వినతి పత్రం  సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ బాన్సువాడ ఏరియా ఆసుపత్రి మరియు ఎంసిహెచ్ హాస్పిటల్ లో పనిచేస్తున్న పేషంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్, శానిటేషన్  కార్మికులకు ఆగస్టు,సెప్టెంబర్ రెండు నెలల బకాయి వేతనాలను సంబంధిత కాంట్రాక్టర్ వీరభద్ర ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ కాంట్రాక్టర్ వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బతకమ్మ పండగ మరియు దసరా పండగలను దృష్టిలో పెట్టుకొని రెండు నెలల పూర్తిగా బకాయి వేతనాలు చెల్లించాలని ఆయన తెలిపారు. పి.ఎఫ్ స్లిప్పులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే శ్రీ మిత్ర ఏజెన్సీలో పనిచేస్తున్న కార్మికులకు కూడా బకాయి వేతనాలు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సయ్యద్ కమర్ అలీ, ధనుంజయ్, ప్రేమ్ సింగ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు