కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోని  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ - మోలుమూరి శ్రీనివాస్

కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోని  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ - మోలుమూరి శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోని  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించాలని,  రామగిరి మండలం సెంటనరీ కాలనీ RG-3  ఏరియాలోని పారిశుద్ధ కార్మికులతో పెద్దపల్లి జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు,  రామగిరి మండల బిజెపి అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన కార్మికులతో కలిసి మాట్లాడుతూ  25 సంవత్సరాలుగా సింగరేణిలో పనిచేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు గా చాలిచాలని జీతాలతో బ్రతుకుతున్నారని, కార్మికులకు లాభాల వాటా బోనస్ కుటుంబానికి వైద్య సౌకర్యం కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలి మోలుమూరి డిమాండ్ చేశారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మేనిఫెస్టో చైర్మన్ గడ్డం వివేక్ వెంకటస్వామి,  రాష్ట్ర నాయకులు సునీల్ రెడ్డి ద్వారా వారి దృష్టికి వీరి సమస్యలు మేనిఫెస్టో లో పెట్టే విధంగా తీసుకెళ్తామని,  కాంట్రాక్ట్ కార్మికులు కష్టాలు అనుభవిస్తున్నారని, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పర్మినెంట్ చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట మార్చి వాళ్లు కాంట్రాక్ట్ కార్మికులు కాదు ఔట్సోర్సింగ్ కార్మికులని అన్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఎన్నో డిపార్ట్మెంట్ల ను  పర్మినెంట్ చేసి జీతాలు పెంచిన కేసీఆర్.  సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.  

సింగరేణి అభివృద్ధిలో వీళ్ళ పాత్ర కూడా ఎంతో ఉందని, రాబోయే రోజుల్లో బిజెపి కి కాంట్రాక్ట్ కార్మికులు మద్దతిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. బీజెపి అధికారంలోకి వస్తే మంథని నియోజకవర్గం లో పార్టీ ని గెలిపిస్తే కోల్ ఇండియా వేతనాలు, సింగరేణిలో లాభాల వాటా, బోనస్, ఉండడానికి క్వార్టర్స్, కుటుంబాలకు వైద్య సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ ఐటి సెల్ కన్వీనర్ తొట్ల రాజు, మండల నాయకులు మెరుగు శ్రీకాంత్, కందుల రమేష్, సదానందం, జనార్ధన్, రమేష్, కుమారస్వామి, తిరుపతమ్మ, ఓదమ్మా, లక్ష్మి, రాధ అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.