జనవాసాల మధ్య మురికి నీరు - దుర్వాసన వెదజల్లుతుందని గ్రామస్తుల ఆరోపణ

జనవాసాల మధ్య మురికి నీరు - దుర్వాసన వెదజల్లుతుందని గ్రామస్తుల ఆరోపణ

ముద్ర, ఎల్లారెడ్దిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో జనావాసాల మధ్య ఉన్న మురుగునీటి గుంత దుర్వాసన వెదజల్లుతుందని,  దోమలతో అనారోగ్యానికి గురవుతున్నామని  అక్కడ నివసిస్తున్న గ్రామస్తులు పేర్కొన్నారు.ఆకుల రమేష్ ఇంటి నుండి గూడెం చిరంజీవి ఇంటి వరకు ఇదే మురుగు నీటి దుస్థితి నెలకొంది. పలుమార్లు గొల్లపల్లి గ్రామ పాలక వర్గానికి మురికి కాలువ నిర్మాణం చేయాలని కాలనీ వాసులు కోరినట్లు తెలిపారు.అదికారుల్లార ఇట్లాంటి చోట మీరు ఉంటారా అని అక్కడి ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు