ప్రతిపక్ష పార్టీల నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దు..

ప్రతిపక్ష పార్టీల నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దు..
  • అభివృద్దిని చూసి ఆశ్వీ
  • మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్

ఇల్లంతకుంట, ముద్ర:ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో  సుమారు 35 లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రారంభోత్సవం ,శంకుస్థాపనలు  చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి,ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని, గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ది జరగలేదని అన్నారు. గ్రామాలు సుభిక్షంగా ఉండేందుకు అనేక వసతులు, సదుపాయాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పిస్తున్నారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం,గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సారధ్యంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తూ, ప్రతి గ్రామంలో కావలసిన సిసి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తదితర అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, గ్రామాల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తోడ్పాటు అందిస్తూన్నారని అన్నారు.

మానకొండూర్ నియోజకవర్గ  ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో గౌరవ మంత్రులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరియు వినోద్ కుమార్ గార్ల సహాకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు.మానకొండూర్ నియోజకవర్గ ప్రాంత ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్దంగా ఉన్నామని, నిరంతరం వారి సంక్షేమం కోసమే పని చేస్తున్నామని అన్నారు.ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపునే ఉండాలన్నారు. ముచ్చటగా మూడవసారి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారే హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.

ఇల్లంతకుంట గ్రామానికి చెందిన  కనుయ్య యాదవ్,నలువాల పోచయ్య యాదవ్ కు చెందిన సుమారు 10గొర్లు రైతు పత్తి చేనులో మేస్తూ చనిపోగ పొలందగ్గరికి వెళ్లి యాదవులతో మాట్లాడినారు..అనంతరం వెల్జీపూర్ గ్రామానికి చెందిన  ఓరెం దీలీప్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా శవయాత్రలో పాల్గోని వారి కుటుంబ సభ్యులను పరామర్షించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ మామిడి సంజీవ్, పీఏసీ ఎస్ చైర్మన్లు తిరుపతి రెడ్డి, ఆనంతరెడ్డి, సర్పంచ్ చల్ల నారాయణ, ఎంపీటీసీ పుష్పలత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.