ఆధునీకరణ మరమగ్గాలు, ప్రాసెసింగ్ యూనిట్లు సహాయం అందజేస్తాం

ఆధునీకరణ మరమగ్గాలు, ప్రాసెసింగ్ యూనిట్లు సహాయం అందజేస్తాం
  • ఆధునీకరణ మరమగ్గాలు, ప్రాసెసింగ్ యూనిట్లు సహాయం అందజేస్తాం
  • ఔత్సాహికులు ఈ నెల 25 వ  తేదీలోగా తమ ప్రాజెక్టు రిపోర్టు తో కూడిన దరఖాస్తులను జిల్లా చేనేత ,
  • జౌళి శాఖ కార్యాలయంలో సమర్పించాలి
  • జిల్లా చేనేత,జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆధునీకరణ మరమగ్గాలు, ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే ఔత్సాహికులకు వారి  ప్రాజెక్ట్ రిపోర్టుల ఆధారంగా క్రెడిట్ లేదా మార్కెటింగ్, గైడెన్స్ లేదా ఇతరత్రా ఏదైనా  సహాయం కు అవసరమైన చర్యలు శాఖ పరంగా తీసుకోనున్నట్లు జిల్లా  చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ తెలిపారు.

ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఔత్సాహికులు వ్యక్తులు , గ్రూప్ లు  ఎవరైనా ఆధునీకరణ మరమగ్గాలు మరియు ప్రాసెసింగ్ యూనిట్లు ఇతర వస్త్రోత్పత్తికి సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేసుకొనే వారు తమ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టులను వారం రోజుల్లోగా సిరిసిల్ల లోని జిల్లా చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయంలోసమర్పించినట్లయితే వారికి మార్కెటింగ్ , క్రెడిట్ , ఇతరత్రా అవసరమైన  సహాయం చేస్తామని  ఏడి పేర్కొన్నారు