ఉత్కంఠ రేపుతున్న భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక..

ఉత్కంఠ రేపుతున్న భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక..

నువ్వా? నేనా...? తాడో పేడో అంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అన్ని పార్టీల నాయకులలో ఉత్కంఠ రేపుతుంది. భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేడు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేయడంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠగా మారింది. నోటిఫికేషన్ రావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చెందిన నాయకులు భువనగిరి మున్సిపల్ పీఠంపై పొగ వేయడానికి జోరుగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సీట్ కైవసం చేసుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపుకు వెళ్లినట్లు సమాచారం. భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్పై 35 మంది సభ్యులు ఉండగా పార్టీలకతీతంగా 31 మంది కౌన్సిలర్లు చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య లపై జనవరి నెలలో అవిశ్వాస తీర్మానానికి నోటీసును కలెక్టర్ కార్యాలయంలో అందజేసిన విషయం విదితమే. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన 18 మంది కాంగ్రెస్ పార్టీకి 9 మంది కౌన్సిలర్లు, బీజేపీ పార్టీకి అరుగురు కౌన్సిలర్లు ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపొందడంతో మున్సిపల్ రాజకీయాలలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అందులో భాగంగానే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీ 14 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఓటుతో కలిసి 15 కు చేరాయి. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ సీటు దక్కించుకోవడానికి సీనియర్ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

నువ్వా? నేనా...? తాడో పేడో అంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు

బీఆర్ఎస్ పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయిన కౌన్సిలర్ లు.? - కాంగ్రెస్ సీనియర్లో నేతలు మధ్య చైర్మన్ సువ్వా నేనా - అవకాశం నెలకున్న తీవ్ర పోటీ వస్తే చైర్మన్ లేదా వైస్ దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ..! - ఏ ఒక్క పార్టీకి సరిపడ మెజార్టీ కోరం లేక తండ్లటా..! నిర్వహించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోందోనని ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే 18 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీని 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం జరిగింది. రోజురోజుకు కౌన్సిలర్ కాంగ్రెస్- పార్టీలో చేరుతూ బలహీన పడడమే కాకుండా రెండు గ్రూపులుగా చీలిపోయినట్లు బీఆర్ఎస్ నేతలే బాహాటంగా చెప్తున్నారు. బీజేపీ పార్టీకి అరుగురు సభ్యులే ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నికకు ప్రధాన భూమిక పోషించనున్నారు. అవకాశం కలిసి వస్తే చైర్మన్ లేదా వైస్ చైర్మన్ ను దక్కించుకోవాలని చూస్తుంది.

నేడు చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై సమీపిస్తున్న కొద్ది జంపు జిలానీలు పార్టీలను మారుతూ ఏ ఏ సభ్యుడు ఎప్పుడు మారతారో తెలియని సందిగ్ధంలో రాజకీయ నాయకులను ఆలోచింపచేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఏ ఒక్క పార్టీకి చైర్మన్ ఎన్నికకు పూర్తిస్థాయిలో కోరం లేక మూడు ముక్కలాటగా మారింది. చైర్మన్ కోసం ఆశావాలు సభ్యులకు ఏడు నుంచి 8 లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ పదవి కాలం 11 నెలలు ఉండడం కూడా వివిధ పార్టీలకు చెందిన పెద్దగా నాయకులు సీరియస్ తీసుకోవడం లేదని పార్టీలోని క్యాడర్ అభిప్రాయాన్ని వెలిబుస్తున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హయంలో భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ లపై మొదటిసారి అవిశ్వాసం ఎదుర్కోబోతున్నది. ఎవరు చైర్మన్ వైస్ చైర్మన్ అనేది నేడు తేలనుంది.