గోదావరిఖనిలో పరీక్ష కేంద్రం దొరకక ఇంటర్ విద్యార్థుల ఇబ్బందులు...

గోదావరిఖనిలో పరీక్ష కేంద్రం దొరకక ఇంటర్ విద్యార్థుల ఇబ్బందులు...

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గోదావరిఖని లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కేటాయించిన సెంటర్ లో కాకతీయ జూనియర్ కళాశాల క్యాంపస్ లో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు సమయానికి కళాశాల చిరునామా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాకతీయ జూనియర్ కళాశాల యాజమాన్యం కళాశాలను పాత క్యాంపస్ నుండి నూతన క్యాంపస్ లోకి మార్చడంతో విద్యార్థులకు సమస్యలు తలెత్తాయి. పాత కాకతీయ కళాశాల కాంప్లెక్స్ లో గాంధీ కళాశాలకు సెంటర్ కేటాయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.