ఈనెల 12న 2కె రన్ ను విజయవంతం చేయండి
మఠంపల్లి ,ముద్ర: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 12 హుజుర్ నగర్ లో జరిగే 2కె రన్ లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మఠంపల్లి యస్ ఐ బాలకృష్ణ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 6.30 నిమిషాలకు హుజుర్ నగర్ టౌన్ లో 2కె రన్ ఉంటుందని కావున మండలంలోని యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.