100 శాతం ఓటింగ్ లక్ష్యం

100 శాతం ఓటింగ్ లక్ష్యం
  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:100 శాతం ఓటింగ్ లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా గురువారం మెదక్ మండలం రాజ్ పల్లి, మెదక్ పట్టణం దాయరలో ఓటరు నమోదు అవగాహన నిర్వహించగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ  రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు.

కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ...

అధికారులందరూ ప్రజలకు చైతన్యవంతులు చేయాలని పిలుపు నిచ్చారు. ఓటు హక్కు స్వేచగా ఉపయోగించాలని, ప్రలోభాలకు లోనూ కాకూడదని, ఓటు బ్రహ్మాస్త్రమని, ప్రజాస్వామ్యాన్ని ప్రభావితంచేసే శక్తి ఉందన్నారు. ప్రజలందరికీ ఓటు విలువ సమానంగా ఉంటాదని,  ఓటు దుర్వినియోగం చేయకూడదన్నారు.జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ... ఏదైనా పిర్యాదులు ఉంటే , సి విజిల్ ఆప్ లో  ఫిర్యాదు చేయవచ్చని, కంట్రోల్ రూమ్  టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్  చేయవచ్చని డబ్బు, మద్యం, ఏదైనా వస్తువుల పంపిణీ జరిగిన నేరుగా ఫిర్యాదు  చేయవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో  పిడి మెప్మా ఇందిరా , ఆర్డిఓ అంబదాస్ రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, తెలంగాణ సంస్కృతిక శాఖ కళాకరుల ఆట పాటతో అలరించారు. ప్రజలు అధిక సంఖ్యల లో పాల్గొన్నారు.