ప్రత్యేక పరిస్థితి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి

ప్రత్యేక పరిస్థితి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి
  • పీ ఆర్ టి యూ టి ఎస్ నాయకులు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణా రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు -2023 ప్రక్రియలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుండి మినహాయించాలని పీ ఆర్ టి యూ టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష,కార్యదర్శి యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు  కలెక్టర్ కార్యాలయంలో ఏఓ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను,గర్భిణీ , చంటి పిల్లల తల్లులు, మెటర్నిటీ సెలవుపై ఉన్న వారిని, 6 నెలలలోపు పదవీ విరమణ చేయబోయే ఉపాధ్యాయులను నవంబర్ 30న జరుగబోయే శాసనసభ
ఎన్నికల విధుల నుండి మినహాయించాలని కోరారు.