పలు దొంగతనం కేసుల్లో 4 గురు నిందితుల అరెస్టు

పలు దొంగతనం కేసుల్లో 4 గురు నిందితుల అరెస్టు
  • 6.9. తులాల బంగారం, ఆటో బైక్ సీజ్
  • జిల్లా ఎస్పీ ఎగ్గడీ భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, జగిత్యాల, మల్లాపూర్, మల్యాల మండలం కొండగట్టు ప్రాంతాల్లో జరిగిన పలు దొంగతనాలలో 4 గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6.9 తులాల బంగారు ఆభరణాలు ఆటో బైక్ సీజ్ చేసినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి వివరాలు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం బస్టాండ్ సమీపంలో పద్మశాలి సంఘ భవనం వద్ద ఓ వృద్ధురాలు మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసు అపహరించుకు వెళ్ళిన అదే గ్రామానికి చెందిన గడ్డమీది మునిందర్ ను అరెస్ట్ చేశారు. అలాగే జగిత్యాల పట్టణంలో ఈ నెల 16న ఆర్టీసీ డిపో వద్ద ఓ మహిళ మెడలో నుంచి రూపాయలు 4 వేల విలువచేసే రోల్డ్ గోల్డ్ చైన్, 24న సాయిబాబా గుడి దగ్గర ఓ మహిళ మెడలో నుంచి రూ.1.80 లక్షల విలువ చేసి 39 గ్రాముల బంగారు పుస్తెలతాడు అపహరించుకుని వెళ్లిన మల్యాల మండలం నూకపల్లికి చెందిన మహమ్మద్ అఖిల్, పొట్టె భీమ్ రావులను అరెస్ట్ చేశారు.

అఖిల్ మరో ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగిలించినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే  ఈనెల 21న మెట్పల్లి పట్టణంలోని మహాలక్ష్మి వైన్ షాప్ లో, 15న మల్లాపూర్ మండలం ఓబులాపూర్ శివారులోని మల్లన్న గుడిలో, మెట్పల్లి మండలం వేంపేట మహాలక్ష్మి కిరాణం తాళాలు పగలగొట్టి చోరీ చేసిన కేసుతో పాటు 22న మల్యాల మండలం ముత్యంపేటలో కోడిగుడ్లు విక్రయిస్తున్న ట్రాలీ ఆటో దొంగతనం చేసిన కేసులో నిందితులైన మెట్పల్లి ఇందిరా నగర్ కు చెందిన బొల్లవేణి మహేష్, బొల్లవేని రాజేష్  అరెస్ట్ చేసినట్లు ఎస్పి తెలిపారు. నిందితులనుంచి ఒక బైక్, ట్రాలీ ఆటో, 4 వేల నగదు, కంప్యూటర్ మానిటర్ సిజ్ చేశారు. కేసులను చేదించి నిధింతులను పట్టుకున్న మెట్ పల్లి, జగిత్యాల డిఎస్పిలు రవీందర్, ప్రకాష్, జగిత్యాల, మెట్టుపల్లి సిఐలు కిషోర్, లక్ష్మినారయణ, మల్యాల, మెట్టుపల్లి, ఇబ్రహీంపట్నం ఎస్ఐలు చిరంజీవి, శ్యాంరాజు, ఉమసాగర్, ఎఎస్ఐ, పొలిసుసిబ్బందిని ఎస్పీ భాస్కర్ అబినంధించారు. అలాగే దుకాణం యజమానులు, ప్రార్ధన మందిరాల నిర్వాహకులు విధిగా సిసి కేమారాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైన ఇంటికి తాళం వేశి ఊరుకి వెళ్ళినట్లు అయతే పొలిసులకు సంచారం ఇస్తే తగు పొలిసు బీట్లు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.