ఆధార్ సేవలకు మోక్షమెప్పుడో...?

ఆధార్ సేవలకు మోక్షమెప్పుడో...?
  • ఆధార్ లేక అవస్థలు
  • పట్టించుకోని అధికారులు

భూదాన్ పోచంపల్లి, ముద్ర;భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మీ సేవలో ఉన్న ఆధార్  సెంటర్ నెల రోజులుగా మూతపడడంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రేషన్ ఈ కేవైసీ లో భాగంగా చిన్నారుల ఆధార్ పునరుద్ధరణతో పాటు వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది .ఇది తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాలి. ఇలా వందల సంఖ్యలో వేలిముద్రలను కొత్తగా నమోదు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతోపాటు కొత్త ఆధార్ కార్డులు ,పాత వాటిలో మార్పుల  కోసం సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది. నెల రోజులుగా పట్టణంలో ఉన్న ఆధార్ కేంద్రం  నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ సవరణ కోసం 20 కిలోమీటర్ల మేర చౌటుప్పల్ లేదా భువనగిరికి వెళ్లాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్షరమే సంబంధిత అధికారులు స్పందించి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.