Abhay Kailas Rao Patil బీఆర్​ఎస్​లో ‘మహా’నేత

Abhay Kailas Rao Patil బీఆర్​ఎస్​లో ‘మహా’నేత
  • ప్రగతిభవన్​లో  గులాబి దళపతి కేసీఆర్​గులాబి కండువా కప్పి ఆహ్వానం
  • పర్భణీ జిల్లాకు చెందిన యువనేత అభయ్​కైలాస్​రావు పాటిల్​ చేరిక
  • మరో భారీ బహిరంగ సభకు ప్లాన్​

ముద్ర తెలంగాణ బ్యూరో: బీఆర్​ఎస్​లో మహారాష్ట్రకు చెందిన నేతల చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన పలువురు కీలక నేతలు పార్టీలోచేరారు. బుధవారం నాడు మరో కీలక నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో పట్టువున్న రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత ‘అభయ్ కైలాస్ రావు పాటిల్ చిక్టాగావోంకర్’ బుధవారం నాడు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభయ్ కైలాస్ రావు పాటిల్ కుటుంబం అంతా రాజకీయ నేపథ్యంకు చెందినది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పర్భణీ పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో మంచి పేరుంది. ఆ ప్రాంతాల్లో వీరి కుటుంబానికి మంచి రాజకీయ పట్టుఉంది.

పాటిల్ తండ్రి మాజీ ఎమ్మెల్యే కైలాస్ పాటిల్, ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. ఈయన  తాతగారు దిగంబర్ రావు వాడికర్ కూడా మాజీ ఎమ్మెల్యేగా కొనసాగారు.  అలాగే  చిన్నాయన బావు సాహెబ్ పాటిల్ ఎమ్మెల్యే గా రెండు సార్లు పోటీ చేశారు. పాటిల్ మేనత్త ఔరంగాబాద్  జిల్లా పరిషత్  మాజీ ప్రెసిడెంట్ గా గతంలో పనిచేశారు. వీరి కుటుంబం అంతా రాజకీయనేపథ్యం కలిగినది కావడం గమనార్హం. ఈ చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తదితరులున్నారు.మెదటిసారి నాందేడ్ సభకు ధీటుగా  మొన్నటి కాందార్ లోహ లో జరిగిన రెండవ సభ విజయవంతం కావడమే అందుకు నిదర్శనం. కేసీఆర్ ప్రభంజనం సెగ తగలుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు వేడెక్కాయి.  దీంతో మహారాష్ట్రలో త్వరలోనే మరో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్​ఎస్​ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.