మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు .ఎస్ ఐ

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు .ఎస్ ఐ

ముద్ర తిరుమలగిరి: మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేస్తామని తిరుమలగిరి ఎస్సై వై.ప్రసాద్ అన్నారు మంగళవారం సాయంత్రం తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని మోత్కూర్ రోడ్ లో నిర్వహించిన వాహనాల తనిఖీ సందర్భంగా ఆయన వాహన యజమానులతో మాట్లాడారు . నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఆయన అన్నారు అలాగే ఆటో యామానులు తమ ఆటోలలో పరిమితికి మించి కూలీలను ప్రయాణికు లను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని అని అన్నారు కొంతమంది ఆటోలో కూలి పనులకు వెళ్లే కూలీలను 15 నుండి 20 మంది వరకు తరలిస్తున్నారని ఒకవేళ ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు వీదీన పడతాయని అని చెప్పారు.

ఇప్పటికైనా వాహనదారులు నిబంధన ప్రకారం ప్రయాణికులను కూలీలను తరలించాలని ఆయన కోరారు ప్రతి వాహనాదారుడు డ్రైవింగ్ లెసన్ తో పాటు యూనిఫామ్ వాహన స్టేషన్ పత్రాలు కచ్చితంగా తమ వెంట ఉంచుకోవాలని ఆయన కోరారు. వాహన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని అలాగే మైనర్లకు వాహనాలను నడిపితే తల్లిదండ్రులే బాధ్యత వహించాలని ఆయన హెచ్చించారు.