కడియం శ్రీహరి ముందే కొట్టుకున్న కార్యకర్తలు

ముద్ర,తెలంగాణ:- కడియం శ్రీహరి ముందే కొట్టుకున్నారు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు. వరంగల్‌ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంది. కడియం శ్రీహరి ముందే కొట్టుకున్నారు కార్యకర్తలు. దీంతో మధ్యలో నుంచే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్య వెళ్లిపోయారు. జనగామ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది.

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల మండల స్థాయి సమీక్షా సమావేశంలో లింగాలఘనపురం జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, మరికొందరు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలను చించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కావ్య సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రసాభాస జరిగింది. ఇక చేరికలు పూర్తికాకుండానే మధ్యలో నుండి వెళ్లిపోయారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.