BIG BREKING - పవన్ కళ్యాణ్‌ తో భేటీ అయిన అంబటి రాయుడు

BIG BREKING - పవన్ కళ్యాణ్‌ తో భేటీ అయిన అంబటి రాయుడు

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తొమ్మిది రోజులకే ఆ పార్టీని వీడారు.దుబాయ్‌లో జరిగే ఐఎల్‌టి 20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడటంపై దృష్టి పెట్టేందుకు తాను రాజకీయాలకు విరామం ఇస్తున్నట్లు తెలిపాడు.అనూహ్యంగా అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బుధవారం భేటీ అయ్యారు.పవన్‌తో తాజాగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.పవన్ కళ్యాణ్‌ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా.. లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.