తీహార్‌ జైలు నుంచి సుఖేష్‌ చంద్రశేఖర్ మరో లేఖ

తీహార్‌ జైలు నుంచి సుఖేష్‌ చంద్రశేఖర్ మరో లేఖ

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఆర్థిక నేరారోపణల కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ రిలీజ్ చేశాడు. ఎక్సైజ్ పాలసీ కేసులో అభియోగాలతో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని ఆరోపిస్తూ లేఖ విడుదల చేశాడు. అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు.

మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక అధికారిని జైలు ఆఫీసర్‌గా నియమించుకున్నట్లు లేఖలో తెలిపాడు సుఖేష్. జైలు అధికారి ధనుంజయ్ రావత్ తనను బెదిరించినట్లు ఆరోపించాడు సుఖేష్. మూడు రోజుల నుంచి జైళ్లశాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్, అధికారులు ద్వారా తనను బెదిరిస్తున్నట్లు లేఖలో చెప్పాడు సుఖేశ్. స్టేట్‌మెంట్ ఇవ్వొద్దని తనపై ఒత్తిడి తెస్తున్నారని లేఖలో తెలిపాడు. ఎవరు బెదిరించినా భయపడకుండా నేతల బండారం బయటపెడతానంటూ లేఖలో తెలిపాడు సుఖేష్.