నష్టాన్ని  అంచనా వేసి, తెగిపోయిన కట్టలు,రోడ్ల కు  మరమత్తులు చేయాలి

నష్టాన్ని  అంచనా వేసి, తెగిపోయిన కట్టలు,రోడ్ల కు  మరమత్తులు చేయాలి
  • అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో కురిసిన భారీ వర్షానికి నష్టాన్ని త్వరగా అంచనా వేసి,తెగిపోయిన కట్టలు,రోడ్ల కు త్వరితగతిన తాత్కాలిక మరమత్తులు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు కట్టలు,రోడ్లు తెగిపోవడం,పంట పొలాల్లో ఇసుక మేటలు వేయటం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లగా అయా ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు నెలల్లో పడాల్సిన వర్షం 8 రోజుల్లో పడడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రాయికల్ లో 180 శాతం,జగిత్యాల 102 శాతం,సారంగా పూర్ 33 శాతంబీర్ పూర్ లో 35 శాతం అధిక వర్షాలు కురిశాయని తెలిపారు.అంతర్గం ఓడ్డెర కాలనీ గ్రామంలో గతంలో నీటి కొరత ఉండేదని నేడు ఆ పరిస్తితిలేదన్నారు.

భారీ వర్షాల వల్ల ప్రజలను అప్రమత్తం చేయటం వల్ల ప్రాణ నష్టం తప్పింది అని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువులు, వాగులు కబ్జాకు గురయ్యాయన్నారు. అధికారులు ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేశారని,నష్ట పరిహారం వచ్చేవిదంగా కృషి చేస్తామని అన్నారు.ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు అతీతులు కారని,చెరువులు,వాగులు కబ్జాకు గురి కాకుండా రైతులు చూడాలని,ప్రభుత్వం అన్ని చేయలేదని అన్నారు.స్వచ్ఛందంగా ప్రజలు,రైతులు సహకారం ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, సర్పంచ్ బోనగిరి నారాయణ, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శేకర్ రెడ్డి, గ్రామ శాక అధ్యక్షులు స్వామిరెడ్డి,నాయకులు రాజీ రెడ్డి, గంగాధర్, శ్రీనివాస్, మల్లేశం, శేకర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.