అందరికీ ఆరోగ్యం.. ప్రధాని మోడీ లక్ష్యం

అందరికీ ఆరోగ్యం.. ప్రధాని మోడీ లక్ష్యం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి చిగురుమామిడి

ముద్ర న్యూస్: దేశ ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తెలిపారు.ప్రధాని మోడీ తొమ్మిది ఏండ్ల సుపరిపాలన సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బిజెపి మండల అధ్యక్షులు దుడ్డేల లక్ష్మి నారాయణ అధ్వర్యంలో రేకొండ గ్రామంలో గడప గడపకు నరేంద్ర మోడి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గ్రామస్తులకు వివరించారు.ఈ సంద్భంగా అయన మాట్లాడుతూ... .ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ దేశంలో 10.7 కోట్ల కుటుంబాలకు, ఆరోగ్య భీమా కవరేజీ, అయుష్మాన్ భారత్ ద్వారా 4.5 కోట్ల ప్రజలకు ఉచిత వైద్యం,9 వేల పైన జన్ ఔషధీ కేంద్రాలలో సరసమైన ధరలకు మందులు, వైద్యశాలలు బలోపేతం కోసం 64,180 కోట్ల రూపాయలను కేటాయింపు చేశారని తెలిపారు.

అయుష్మన్ భారత్ కింద 1.59 లక్షల పైన ఆరోగ్య కేంద్రాలు, ప్రపంచం లోనే అత్యంత భారీ టీకా కార్యక్రమం ద్వారా 220 కోట్ల పైన కరోనా టీకా డోషులు,మిషన్ ఇంద్రధనస్సు ద్వారా 5.65 కోట్ల మంది తల్లుల పిల్లలకు టీకా రక్షణ కల్పించారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పైడిపెల్లీ శ్రీనివాస్, కొండాపూర్ మాజీ సర్పంచి వంగర మల్లేశం,మండల ఉపాధ్యక్షులు కంది శంకర్,నాయకులు గందే చిరంజీవి,కరంపురి వెంకటేష్, కసాని సతీష్,బూత్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సాగర్ రెడ్డి,సంపత్ రెడ్డి,సునీల్,శ్రీనివాస్, పడాల శ్రీనివాస్, గండ్రోత్ రామన్న తదితరులు పాల్గొన్నారు.