మున్సిపల్ వైస్ చైర్మన్ పై వీగిపోనున్న అవిశ్వాసం

మున్సిపల్ వైస్ చైర్మన్ పై వీగిపోనున్న అవిశ్వాసం

హైదరాబాద్ క్యాంపుకు తరలిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ లో బిఆర్ ఎస్  వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోనుంది. మున్సిపల్ చైర్ పర్సన్ గా గత ఏడాది క్రితం భోగ శ్రావణి రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్ళింది. అయితే అప్పటి కలెక్టర్ ఇన్చార్జి  మున్సిపల్  చైర్మన్గా వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న గోలి శ్రీనివాస్ కు  బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ భాద్యతలు  తాత్కాలికమే అనుకొని నూతన చైర్పర్సన్ నియమిస్తారని బిఆర్ఎస్ కౌన్సిలర్లు భావించారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన భోగ శ్రావణి రాజీనామాతో అదే సామాజిక వర్గానికి చెందిన తమకే చైర్పర్సన్ పదవి కేటాయించాలని జ్యోతిలక్ష్మ న్ లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా తమకు అవకాశం కల్పించాలని గతంలో కోరిన సమీన్ల వాణి శ్రీనివాస్ తో పాటు బలహీన వర్గానికి చెందిన వల్లేపు రేణుక మొగలిలీలు చైర్ పర్సన్ పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.

ఏడాది కాలం గడిచిన చైర్ పర్సన్ ఎన్నిక జరకపోగా తమకు పనులు జరగడం లేదని, అధికారులు సక్రమంగా పనిచేయడంలేదని  పూర్తిస్థాయి చైర్పర్సన్ కావాలని కౌన్సిలర్లు ఇన్చార్జి చైర్పర్సన్ గా కొనసాగుతున్న వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై కలెక్టర్కు అవిశ్వాస నోటీసు అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం  అవిశ్వాస నోటిసుఫై మున్సిపల్ సమావేశం నిర్వహించనున్నారు. అయితే చైర్ పర్సన్ లేకుండా ఉన్న వైస్ చైర్మన్ ను తొలగిస్తే ప్రత్యేక అధికారి పాలన వస్తుందని దాంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తయని భావించిన బిఆర్ఎస్ నాయకులు. వైస్ చైర్మన్ పై అవిశ్వాసం వీగిపోయేందుకు కౌన్సిలర్లు అందరిని హైదరాబాద్ కు తరలించారు. వీరితో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడి వారికి నచ్చచెప్పినట్లు తెలిసింది.