ఏప్రిల్‌ 13న చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ

ఏప్రిల్‌ 13న చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇదివరకే కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు క్యాంపెయిన్ వేగవంతం చేయనున్నారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నేడు నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ నేతల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.