గవర్నర్​ అపాయింట్మెంట్​ కోరిన సీఎం కేసీఆర్...

గవర్నర్​ అపాయింట్మెంట్​ కోరిన సీఎం కేసీఆర్...

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మెజార్టీ స్థానాలు దక్కుతుండటంతో.. బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ రాజీనామాకు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్నం 1 గంట ఫలితాల వరకు 12 స్థానాల్లో కాంగ్రెస్​విజయం సాధించింది. మొత్తంగా71 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. అధికార బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 34 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఓడిపోయే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే ఈరోజు (ఆదివారం) సాయంత్రం గవర్నర్‌కు కేసీఆర్ రాజీనామా లేఖను పంపనున్నట్లు సమాచారం.