మంథని లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చల్లా నారాయణరెడ్డి

మంథని లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చల్లా నారాయణరెడ్డి

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:మంథని నియోజకవర్గంలో మంగళవారం ఒకేసారి రెండు నామినేషన్ లు దాఖలు చేసిన చల్లా సుజాత నారాయణ రెడ్డి దంపతులు.వారం రోజుల క్రితం బిజేపిలో చేరిన చల్ల బీజేపీ ఎమ్మెల్యే టికెట్ సునీల్ రెడ్డికి కేటాయించడంతో బిజేపికి రాజీనామా చేసిన చల్ల... రెండు  రోజుల క్రితం బహుజన సమాజ్ పార్టీలో చేరి వెంటనే మంథని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న నారాయణ రెడ్డి మంగళవారం రోజున మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమ నాయక్ కు నామినేషన్ దాఖలు చేశారు.తన సతీమణి చల్లా సుజాతతో  మరో నామినేషన్ కూడా దాఖలు చేయించారు.

అనంతరం మీడియాతో చల్లా మాట్లాడుతూ...

ప్రభుత్వం మంత్రి నియోజక వర్గంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. మంథని నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.డబ్బుతో ఎర వేస్తూ పార్టీలలో చేర్చుకుంటున్నారని , ఇంతకు ముందు మంథని లో పని చేసిన నాయకులు స్వలాభం కోసం పని చేశారని, తాను మంథని లో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం రావడానికి కృషి చేస్తానన్నారు.దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడే పార్టీ బిఎస్ పార్టీ అన్నారు.ఈ ఎన్నికలలో ఏనుగు గుర్తుకు ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని ప్రజలకు నారాయణరెడ్డి మంథని ప్రజలను కోరారు. ఆయన వెంట బీఎస్పీ నాయకులు ఉన్నారు.