దేవినేని ఉమకు షాకిచ్చిన చంద్రబాబు...

దేవినేని ఉమకు షాకిచ్చిన చంద్రబాబు...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-మాజీ మంత్రి దేవినేని ఉమకు టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. ఆయనకు మూడో జాబితాలోనూ చోటు కల్పించలేదు. దీంతో ఇక దేవినేని ఉమ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. ఇంకా టీడీపీ ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు 11 మందితో మూడో జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలోనూ దేవినేని ఉమ పేరు కనిపించలేదు.