దసరా ఉత్సవాల సందర్భంగా రెండు ప్రధాన పార్టీల మధ్య గొడవ 

దసరా ఉత్సవాల సందర్భంగా రెండు ప్రధాన పార్టీల మధ్య గొడవ 

పలువురికి గాయాలు.. పోలీసుల రంగ ప్రవేశంతో ప్రాణాలతో బయటపడ్డ పలువురు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  బుగ్గారం మండలం గోపులాపూర్ లో మంగళ వారం సాయంత్రం రెండు ప్రధాన పార్టీల మధ్య గొడువ జరగగ కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన పలువురికి బలమైన దెబ్బలు తగిలాయి. పోలీసుల రంగ ప్రవేశంతో ప్రాణాలు దక్కాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆ నాయకునికి అనుచరుడు గా ఉండే ఓ వ్యక్తికి బలమైన దెబ్బలు తగిలినట్లు విశ్వసనీయ సమాచారం.  పోలీసులే లేకుంటే ఆ అనుచరుడు పరిస్థితి దారుణంగా ఉండేదని తెలిసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదర గొట్టారు.

బుగ్గారం ఎస్సై సందీప్ అధ్వర్యంలో పలువురు పోలీస్ సిబ్బంది చాక చక్యంగా వ్యవహరించి, సమయ స్ఫూర్తితో గొడవను అడ్డుకున్నారు. ఈ తగాధాలో పోలీస్ సిబ్బంది కి కూడా దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది.