ఎల్లారెడ్డిపేట ఈవో ను సస్పెండ్ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ఎల్లారెడ్డిపేట ఈవో ను సస్పెండ్ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
Collector Anurag Jayanthi suspended Ellareddypet EO

 మొక్కల సంరక్షణ నిర్లక్ష్యనం చేసినందుకే సస్పెన్షన్ వేటు
 ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మేజర్ గ్రామపంచాయతీ  ఈవో ప్రవీణ్ కుమార్ ను శనివారం జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సాంకేతిక సహాయకుడుప్రభాకర్,ఏపీవో కొమురయ్య, మండల పంచాయతీ అధికారి వజీర్ కు శోకాజ్ నోటీసు జారీ చేశారు. హరితహారం లోనాటిన మొక్కలను సంరక్షణ చేయడంలో విఫలమయ్యారని తన విధుల్లో పారదర్శకత లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై నాటిన మొక్కలకు ట్రీ గార్డ్స్ లేకపోవడం వాటికి సపోర్టు కట్టెలు కూడా లేకుండా పూర్తిగా మొక్కలు పాడై వంగి ఉండడం అదేవిధంగా గిద్ద చెరువు కట్టపై నాలుగు వరుసలుగా నాటిన మొక్కలను సంరక్షించలేదని మొక్కలకు నీరు కూడా అందించలేదని క్షేత్రస్థాయిలో ప్రతిరోజు పర్యవేక్షణ జరుపుతూ వాచ్ అండ్ వార్డుల పనితీరును మొక్కలకు రక్షణ బాధ్యత వహించాల్సిన ఈవో ప్రవీణ్ కుమార్ తన విధులు సక్రమంగా నిర్వహించకుండా వైఫల్యం చెందడంతో విధుల్లోంచి తొలగించారు.