సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింప చేయండి

సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింప చేయండి

గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఆశా వర్కర్లు

ముద్ర, ఎల్లారెడ్డిపేట: సంక్షేమ పథకాలన్నింటినీ  తమ ఆశా వర్కర్లకు వర్తింప చేయాలని పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా ఆశాలకు 18 వేల ఫిక్స్డ్ వేతనాన్ని అందజేయాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల ఆశా వర్కర్ల అధ్యక్షురాలు ఓరుగంటి రాణి ఆధ్వర్యంలో 42 మంది ఆశా వర్కర్లు ర్యాలీగా భగభగ మండే సూర్యుడు చూడు ఆశా వర్కర్ల ఐక్యత చూడు అంటూ నినాదాలు చేస్తూ స్థానిక గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని  మహాత్మా గాంధీ కి తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆశా వర్కర్లకు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేశామని 16 రోజులు సమ్మె కూడా చేయడం జరిగిందని  తెలిపారు. అదేవిధంగా తమ కుటుంబానికి ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు ఇవ్వాలని మట్టి ఖర్చులు 50 వేలు చెల్లించాలని సూచించారు. తమకు ప్రసూతి సెలవుల పైన సర్క్యులర్ను వెంటనే జారీ చేయాలని  హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. పి ఎఫ్ ఈ ఎస్ ఐ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని  పేర్కొన్నారు. తమకు 9750 పారిశోతకం ఇస్తున్నారని  అది కూడా అందరికీ రావడంలేదని పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పారితోషకాలు సరిపోక ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు గోవర్ధన గీత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.